– అధికారులకు మంత్రి తుమ్మల దిశా నిర్దేశం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
భారీ వర్షాల నేపథ్యంలో పంటనష్ట నివారణ చర్యలను తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నతాధికారులను ఆదేశించారు. యూరియా డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. గురువారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ పరిధిలోని పలు అంశాలపై వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపితో కలిసి మంత్రి సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడితో కేంద్రం మూడు రోజుల్లో 18 వేల మెట్రిక్ టన్నులు…వారం రోజుల్లో మరో 31 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసిందని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రైతులు ఆధునిక సాగు పద్ధతుల బాట పట్టేలా యాంత్రీకరణ దిశగా అడుగులు వేయాలని సూచించారు. కూలీల సమస్యను నుంచి గట్టేక్కాలాన్నా, అధిక దిగుబడులను సాధించాలన్నా వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని కోరారు. ప్రభుత్వ పరంగా అందిస్తున్న సబ్సిడీలను రైతులకు తెలియజేయాలని సూచించారు. సిరిసిల్ల జిల్లాల్లో వరద సహాయ చర్యలు బాగున్నాయనీ, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు మంత్రి అభినందనలు తెలిపారు.
ఆలస్యంగా విధులకు హాజరౌతారా? ఉద్యోగులపై మంత్రి తుమ్మల ఆగ్రహం
ఆలస్యంగా విధులకు హాజరౌతున్న ఉద్యోగులపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరిధిలోని శాఖలు, కార్పొరేషన్ల ఉద్యోగుల హాజరుపై మంత్రి ఆరాతీశారు. ఉదయం 10.40 గంటల వరకు కూడా విధులకు హాజరుకాకపోవడమేంటని ప్రశ్నించారు. హాజరుకాని ఉద్యోగుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. శుక్రవారం నుంచి విధులకు ఆలస్యంగా హాజరయ్యే ఉద్యోగులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆ శాఖ డైరెక్టర్ గోపిని మంత్రి ఆదేశించారు.
పంటనష్ట నివారణ చర్యలు తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES