Friday, April 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకల్తీ ఆహార పదార్ధాలపై కఠిన చర్యలు తీసుకోండి

కల్తీ ఆహార పదార్ధాలపై కఠిన చర్యలు తీసుకోండి

- Advertisement -

బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

దేశంలోనే ఆహార కల్తీలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ పెడతామంటూ గత ప్రభుత్వంతోపాటు ప్రస్తుత సర్కారు కూడా మాటలు చెప్పిందని విమర్శించారు. 500 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను నియమిస్తామని చెప్పి మరిచారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే కల్తీ చేస్తున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని డిమాండ్‌ చేశారు. రైజింగ్‌ తెలంగాణ కాదనీ, అనారోగ్య తెలంగాణ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లం నుంచి పనీర్‌ వరకూ అన్నీ కల్తీ అవుతున్నాయని తెలిపారు. కల్తీ నియంత్రణ బాధ్యతను వెంటనే ప్రయివేటు కంపెనీలకు అప్పగించాలని సూచించారు. తమిళనాడులో 500 మంది ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లను, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేశారని తెలిపారు. అదే విధానం మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -