Saturday, September 13, 2025
E-PAPER
Homeజాతీయంరీల్స్‌, ఫొటోలు తీస్తే చర్యలే

రీల్స్‌, ఫొటోలు తీస్తే చర్యలే

- Advertisement -

సుప్రీంకోర్టు హెచ్చరిక
హైసెక్యూరిటీ జోన్‌గా ప్రధాన ప్రాంగణం

న్యూఢిల్లీ : సోషల్‌ మీడియా రీల్స్‌, వీడియోలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలో ఫొటోలు దిగడం, సోషల్‌ మీడియా రీల్స్‌, వీడియోలు చేయడాన్ని నిషేధించింది. ఈ మేరకు ఈ ప్రదేశాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా గుర్తిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు మీడియా ప్రతినిధులు సైతం ఇంటర్వ్యూలు, లైవ్‌ కోసం వారికి కేటాయించిన లో సెక్యూరిటీ జోన్‌? ప్రాంతాన్ని వినియోగించుకోవాలని సూచించింది.

”హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోసం మొబైల్‌ ఫోన్‌ వినియోగించడం నిషేధం. కెమెరాతో పాటు ట్రైపాడ్‌, సెల్ఫీ స్టిక్‌ లాంటి వస్తువులు వాడకూడదు. ముఖ్యంగా రీల్స్‌, వీడియోలు తీయడం నిషిద్ధం. ఒకవేళ ఈ ఆదేశాలను న్యాయవాది, పిటిషనర్లు, క్లర్క్‌లు, బార్‌ అసొసియేషన్‌ సభ్యులు ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ఒకవేళ ఈ నిబంధనలను ఎవరైనా మీడియా ప్రతినిధి అతిక్రమిస్తే సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్‌లోకి నెల పాటు ప్రవేశం ఉండదు.” అని స్పష్టం చేసింది.
ఈ నిబంధనలను ముఖ్యంగా సుప్రీ కోర్టు సిబ్బంది, రిజిస్టీ అతిక్రమిస్తే తీవ్రమైన అంశంగా పరిగణిస్తామని హెచ్చరిక చేసింది. ఇతర శాఖల సిబ్బంది అతిక్రమిస్తే ఆయా శాఖల నిబంధనల ప్రకారం హెచ్‌ఓడీలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా వ్యక్తులు, సిబ్బంది, న్యాయవాదులు హై సెక్యూరిటీ జోన్‌లో ఫొటోలు తీసుకునే సమయంలో అడ్డుకునే హక్కు భద్రతా అధికారులకు ఉంటుందని చెప్పింది.

‘యువ న్యాయవాదులకు అవగాహన కల్పించాలి’
అంతకుముందు సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణంలో రీల్స్‌, వీడియోలు తీసివారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ తీర్మానం చేసింది.
ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ముఖ్యంగా అనేక మంది న్యాయవాదులు సుప్రీం కోర్టు ప్రధాన ప్రాంగణం ముందు వీడియోలు నైతిక విలువలను అతిక్రమిస్తున్నారని ఆరోపించింది. కోర్టు రూముల్లో, కారిడార్లు, లాబీలతో పాటు హై సెక్యూరిటీ జోన్లలో రీల్స్‌, వీడియోలను నిషేధించాలని కోరింది. వీరిని పర్యవేక్షించేందుకు కొందరు పోలీసు అధికారులను నియమించాలని సూచించింది. కోర్టులోని హై సెక్యూరిటీ జోన్‌లో డిస్‌ ప్లే బోర్డులను ఏర్పాటు చేయాలని పేర్కొంది. నిబంధనలు అతిక్రమించిన న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని తెలిపింది. లేఖలతో పాటు సభ్యత్వం రద్దు లాంటి చర్యలతో నిబంధనలను రూపొందించాలని చెప్పింది. ముఖ్యంగా యువ న్యాయవాదులకు దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సలహా ఇచ్చింది. సుప్రీం కోర్టు గౌరవం కాపాడాలంటే ఇలాంటి చర్యలు తీసుకోవాలని బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది.

కేంద్రంతో పాటు ఈసీ, లా కమిషన్‌కు సుప్రీం నోటీసులు
మరోవైపు ఎన్నికల సంఘాన్ని సెక్యూలరిజం, పారదర్శకత, రాజకీయ న్యాయం వంటి అంశాలను పార్టీలు ప్రమోట్‌ చేసేలా నిబంధనలు రూపొందించేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం స్వీకరించింది. ఈమేరకు కేంద్రంతో పాటు ఎన్నికల సంఘం, లా కమిషన్‌కు నోటీసులు జారీ చేసింది. న్యాయవాది అశ్విణి కుమార్‌ ఉపాధ్యారు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినేందుకు జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోరుమల్యా బాగ్చీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అంగీకరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -