Tuesday, February 17, 2026
E-PAPER
Homeబీజినెస్టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ ను నిర్వహించిన టచ్-ఎ- లైఫ్ ఫౌండేషన్

టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ ను నిర్వహించిన టచ్-ఎ- లైఫ్ ఫౌండేషన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :  ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ మరియు వెల్నెస్ సదస్సు టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఆరోగ్య సంరక్షణ భవిష్యత్తును పునర్నిర్మించడంపై దృష్టి సారించిన చర్చలు మరియు సహకార పరివర్తన కోసం విధాన నిర్ణేతలు, వైద్యులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు మరియు సామాజిక ప్రభావ నాయకులను విజయవంతంగా ఒకచోట చేర్చింది.

 ఒక ముఖ్యమైన ఉద్దేశ్యాన్ని టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ నెరవేరుస్తుంది: టిఏఎల్ హాస్పిటల్స్ ద్వారా ఆరోగ్య సంరక్షణ అవకాశాలను విస్తరించే భాగస్వామ్యాలను నిర్మించడం, ఇది తగిన ఆరోగ్య సంరక్షణ సేవలు అందని రోగులను ఉచిత శస్త్రచికిత్సలు, ప్రాణాలను కాపాడే సంప్రదింపులను అందించే ఆసుపత్రులతో అనుసంధానించే ప్రో బోనో నెట్‌వర్క్.

టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ సీఈఓ సాయి గుండవెల్లి మాట్లాడుతూ , “టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ ద్వారా, ఆరోగ్య సంరక్షణ అత్యంత అవసరమైన చోట విస్తరించడానికి మేము సాంకేతికతను ఉపయోగిస్తున్నాము. మెరుగైన వైద్య సేవలను పొందలేనట్టి రోగులను ప్రో బోనో కేర్ అందించే ఆసుపత్రులతో టిఏఎల్ హాస్పిటల్స్ అనుసంధానిస్తుంది, ఆరోగ్య సంరక్షణ అనేది కేవలం స్థానికంగా మాత్రమే కాదు – అది నిజంగా గ్లోకల్ అని నిరూపిస్తుంది. ఈ రోజు, మేము ప్రపంచవ్యాప్తంగా వైద్యులను అనుసంధానించే ప్రపంచ వేదిక అయిన టిఏఎల్ మేడోరాను ప్రారంభిస్తున్నాము. భారతదేశం తమ 1.4 బిలియన్ల మంది ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం కేవలం మూడు మిలియన్ డాలర్లను మాత్రమే ఖర్చు చేస్తున్నందున, సాంకేతికత మరియు సహకారం ఈ అంతరాన్ని – డబ్బు ద్వారా కాదు, ప్రజలు తమ సమయాన్ని మరియు నైపుణ్యాన్ని స్వచ్ఛందంగా అందించడం ద్వారా – తగ్గించగలవని మేము విశ్వసిస్తున్నాము ” అని అన్నారు. 

హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ఈ సమావేశం ప్రారంభమైంది. కర్ణాటక ప్రభుత్వ గౌరవనీయ క్యాబినెట్ మంత్రి శ్రీ ఎన్. ఎస్. బోస్‌రాజు ప్రారంభోపన్యాసం చేశారు. స్థిరమైన ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థలను సృష్టించడానికి ఆవిష్కరణ, నమ్మకం మరియు అవకాశాలను ఏకీకృతం చేయవలసిన తక్షణ అవసరాన్ని ముఖ్యోపన్యాసం  నొక్కి  చెప్పింది.

“మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో పెట్టుబడి పెడుతున్న వేళ, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడంలో సైతం పెట్టుబడి పెడుతున్నాము. సాంకేతికత అపారమైన ప్రభావాన్ని చూపగలదు. గ్రామీణ ప్రాంతంలోని వ్యక్తి కూడా ఆవిష్కరణల మద్దతుతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ నుండి ప్రయోజనం పొందవచ్చు. భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణ నాయకుడిగా నిలబెట్టాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ వంటి వేదికలు ఈ లక్ష్యాన్ని వేగవంతంగా చేరుకోవటానికి తోడ్పడతాయి . ఈ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను సమర్ధించడానికి ,  సాంకేతిక పురోగతి ప్రతి పౌరుడికి చేరేలా చేయటానికి కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని మంత్రి పేర్కొన్నారు.

ఏహెచ్ పిఐ వ్యవస్థాపకుడు మరియు ఏహెచ్ పిఐ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ గోవింద హరి మాట్లాడుతూ “కొవిడ్ తర్వాత, ప్రభుత్వం, లాభాపేక్షలేని సంస్థలు, ఆసుపత్రుల మధ్య భాగస్వామ్యాలు నాణ్యత మరియు లభ్యత,  రెండింటినీ విస్తరించడానికి తప్పనిసరి అయ్యాయి ” అని నొక్కి చెప్పారు. డేటా భద్రత మరియు పాలన, జీవిత భవిష్యత్తు మరియు వ్యాక్సిన్ ఆర్&డి లో విప్లవాత్మక ఆవిష్కరణలు, mRNA, కాంజుగేట్ వ్యాక్సిన్‌లు, ప్రెసిషన్ డెలివరీ టెక్నాలజీలో పురోగతితో సహా ఆకట్టుకునే అంశాలపై కీలకోపన్యాసాలు జరిగాయి. ఏఐ , క్వాంటం సాంకేతికతలు మరియు తదుపరి తరం డేటా వేదికలు ఔషధ ఆవిష్కరణ, రోగ నిర్ధారణలు మరియు రోగి సంరక్షణను ఎలా మార్చగలవో నిపుణులు చర్చించారు. రోజంతా,  కీలకమైన ప్రపంచ ఆరోగ్య సంరక్షణ నేపథ్యాలతో ప్రభావవంతమైన చర్చా కార్యక్రమాల శ్రేణిని టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 నిర్వహించింది.
వీటిలో ఈ దిగువ అంశాలు వున్నాయి
ఆరోగ్య సంరక్షణలో క్వాంటం & ఏఐ యొక్క వాస్తవ స్థితి.
దీర్ఘాయువు & ఆరోగ్యం మరియు వయోధికుల సంరక్షణలో పరివర్తన. 
ప్రపంచ వైద్య పర్యాటక పరిశ్రమలో భారతదేశం యొక్క వ్యూహాత్మక పాత్ర.
మానసిక ఆరోగ్యం – బర్న్అవుట్, డిజిటల్ జోక్యాలు, అపోహల తగ్గింపు మరియు ఆరోగ్య వ్యవధిని మెరుగుపరచడం. 
ఆరోగ్య సంరక్షణ కోసం కమ్యూనిటీ ఛేంజ్ మేకర్స్ ను ప్రోత్సహించటం.
ఈ సదస్సులో కీలక వక్తలుగా మార్క్ లీ (సోలిక్స్ టెక్నాలజీస్), నిషిత్ దేశాయ్ మరియు మిహిర్ పారిఖ్ (నిషిత్ దేశాయ్ అసోసియేట్స్), మరియు డాక్టర్ రమేష్ మాటూర్ (myRNA థెరప్యూటిక్స్) ఉన్నారు. ఈ చర్చా కార్యక్రమాలను ఉదయ్ సక్సేనా (వేల్ ట్యాంక్ బయోక్యాటలిస్ట్), మురళీ కృష్ణం, జో లాంకాస్టర్, రాజు పూసపాటి (సోలిక్స్ టెక్నాలజీస్), డాక్టర్ బాల విద్యాధర్ మల్లాది (పుష్పగిరి విట్రియో రెటినా ఇన్స్టిట్యూట్), మరియు గోపాల్ గార్గ్ (అశోక) మోడరేట్ చేశారు, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ (ఫెర్నాండెజ్ హాస్పిటల్), అన్షు గుప్తా (గూంజ్), దీపిక టి. గ్రంధి  (క్లీవ్‌ల్యాండ్ క్లినిక్) మరియు భారతదేశం ,  అంతర్జాతీయంగా ఉన్న ఆరోగ్య సంరక్షణ నాయకులతో సహా 30 మందికి పైగా ప్రముఖ ప్యానలిస్టులు పాల్గొన్నారు.

గౌరవ తెలంగాణ ప్రభుత్వ ఐటిఈ &సి , పరిశ్రమలు & వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీ శ్రీధర్ బాబు కీలక ప్రసంగంతో ఈ కార్యక్రమం ముగిసింది.  టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, వెల్నెస్ ప్రాక్టీషనర్లు, పరిశోధకులు, స్టార్టప్‌లు, లాభాపేక్షలేని సంస్థలు మరియు ప్రపంచ సంస్థల కోసం ఆలోచనలను మార్పిడి చేసుకోవడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, సమానమైన ఆరోగ్య సంరక్షణ అవకాశాలను వేగవంతం చేయడానికి సహకార వేదికగా పనిచేస్తూనే ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -