- Advertisement -
నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ విటళేశ్వర్ ఆలయంలో మంగళవారం ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ పెంటజీ సభ్యుల ఆధ్వర్యంములో విఠల్ రుక్మిణి దేవత మూర్థులకు ప్రత్యేక పూజలు చేసి తాళ సప్తమి వేడుకలను గ్రామస్తులు ఆలయ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగి చివరి రోజున గ్రామస్తులు గ్రామాల్లో ఉన్న ప్రధాన విధుల గుండా శోభ యత్రా నిర్వహించి సప్తమి వేడుకలు ముగింపు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటజీ పుప్ఫల పీరాజీ సూది రాజన్న నాగలింగం నారా పరశురాం బి. విఠల్ నగేష్, ఏశాల దత్తాత్రి మీర విజయ్ కుమార్ బాబు సంతోష్ ఆనంద్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



