- Advertisement -
నవతెలంగాణ -కల్వకుర్తి
రైతు వద్ద 10 వేల రూపాయలు లంచం తీసుకుంటూ తలకొండపల్లి తహసిల్దార్ నాగార్జున మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మండలంలోని అంతారం గ్రామానికి చెందిన రైతు వద్ద వ్యవసాయ భూమి విషయంలో ఒక లక్ష 50 వేలకు బేరం కుదుర్చకొని మంగళవారం సాయంత్రం అడ్వాన్సుగా 10 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తహసిల్దార్ నాగార్జునపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నట్లు స్థానిక రైతులు ఆరోపించారు. తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబ అధికారులు విచారణ జరుగుతున్నారు.
- Advertisement -