కాంగ్రెస్ మండల నాయకులు..
నవతెలంగాణ – ఊరుకొండ
అర్ధాంతరంగా మృతి చెందిన బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందించి అండగా నిలబడుతున్న జననేత జకినాలపల్లి మాజీ సర్పంచ్ తలసాని అనిల్ రెడ్డి అని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. సోమవారం ఊరుకొండ మండలం రాంరెడ్డి పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బావాజీ తండాకు చెందిన కేతావత్ తుల్జా సతీమణి కేతావత్ ముత్యాలు(55) వారం రోజుల క్రితం హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గోవిందు శ్రీనివాసు యాదవ్ గారితో విషయం తెలుసుకున్న రాష్ట్ర నాయకులు, జననేత, జకినాలపల్లి మాజీ సర్పంచ్ అనిల్ రెడ్డి వారి ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపి తక్షిన సహాయం కింద 5వేల ఆర్థిక సాయం వారి కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో జర్పుల తిరుపతి, జర్పుల రాజు, రవి, నరేష్, శ్రీను, రవి, తదితరులు పాల్గొన్నారు.
నిరుపేదలకు అండగా తలసాని అనిల్ రెడ్డి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



