విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి
నవతెలంగాణ – సదాశివనగర్
విద్యార్థులు సమాజ హితం కొరకు పాటు పడాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మార బాల్ రెడ్డి అన్నారు. తిర్మన్ పల్లిలో పదవ తరగతి లో మార రెశ్వంత్ రెడ్డి, ఉప్పల్ వాయి శ్రీజ లు ఇంటర్ లో నారెడ్డి శ్రీజారెడ్డి సాకలి అర్చన లకు నగదు పారితోషికం తో పాటు మెమెంటోలతో సత్కరించారు. మార బాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యార్థి దశనుండే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికలు రచించుకొని ముందుకు సాగాలని గమ్యం చేరే విశ్రమించకూడ దన్నారు. విద్యార్థి ఎదిగితే కుటుంబం ఎదుగుతుంది, కుటుంబం ఎదిగితే గ్రామం ముందుకు వెళ్తుంది.
గ్రామం ముందుకు వెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి విద్యార్థి విజయమే సమాజ విజయమన్నారు. సమాజంలో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార బాల్ రెడ్డి ,మార భైరవ రెడ్డి, బాల్ రెడ్డి , గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు ముడుపు బాల్ రెడ్డి , నారెడ్డి గోపాల్ రెడ్డి ,ప్రసాద్, రమేష్ రెడ్డి, జిన్న అశోక్, నారెడ్డి లింగారెడ్డి, బాల్ రెడ్డి,, కావేటి సాయిలు, పైడి బాల్ రెడ్డి, నారాయణ, భాస్కర్ రెడ్డి, నర్సారెడ్డి, , విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ప్రతిభాపురస్కారాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES