నవతెలంగాణ-కమ్మర్ పల్లి
గణిత శాస్త్రంలో మండలంలోని పీఎం శ్రీ చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో రామానుజన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్షలో పీఎం శ్రీ చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి రికార్డు నెలకొల్పారు.
మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎస్.ప్రణవి, సిహెచ్. మధుప్రియ, బి.ప్రణవి మొదటి మూడు ర్యాంకులు కైవసం చేసుకుని క్లీన్ స్విప్ చేశారు. గణితం లాంటి క్లిష్టమైన సబ్జెక్టులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చూపిన ప్రతిభ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందనేందుకు నిదర్శనంగా నిలుస్తుంది. మండల స్థాయి గణిత ప్రతిభ పాఠవ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి మూడు ర్యాంకులను సాధించిన పాఠశాల విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య, ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు అభినందించారు.



