నవతెలంగాణ – ఊరుకొండ
ఈనెల 8న ఉమ్మడి మహాబూబ్ నగర్ మక్తల్ లో జరిగిన ఓపెన్ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పొటిల్లో ఊర్కొండ కేజీబీవీ విద్యార్ధినిలు కటాస్ విభాగాల్లో పాల్గోని పతాకాలు సాధించారని కరాటే మాస్టర్ కిరణ్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కటాస్ విభాగంలో శ్రీలేఖ, మమత, శ్రీజ బంగారు పథకాలు చందన, శ్రుతి, శ్రీవాణి, వెండి పథకాలు వైశానవి, చందన, భార్గవి, రజత పథకాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ పోటిల్లో పాల్గోని విజయం సాధించిన విద్యార్థినులకు నాగర్ కర్నూల్ జిల్లా కరాటే అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి, సర్పంచ్ మంజుల శ్రీనివాస్, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శైలేజ, వ్యాయామ ఉపాద్యయురాలు రాధిక, కరాటే మాస్టర్ కిరణ్ నాయక్ లు అభినందనలు తెలిపారు.
కరాటే పోటీల్లో కేజీబీవీ విద్యార్థినుల ప్రతిభ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



