విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి…
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు….
నవ తెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : మానసిక ఒత్తిడి లేకుండా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలను రాయాలని , విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మకమైన వ్యక్తి తీయడం కోసం ఈ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక భువనగిరిలోని భువనగిరి మండలంలోని శ్రీనివాస రామానుజన్ స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు నిర్వహించిన టాలెంట్ టెస్ట్ కు అభినందన సభ నిర్వహించగా, టాలెంట్ టెస్ట్ లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను స్కూల్ డైరెక్టర్ రాజు, శ్రీశైలం ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలలో ఏర్పడిన ఎస్ఎఫ్ఐ, విద్యార్థుల సమస్యల కోసం నికరంగా పోరాడుతున్న సంఘముగా, సమాజంలో అసమానతలు లేని సమాజం సమ సమాజ నిర్మించాలని , కులమత భేదాలు లేకుండా ఆ మానవులందరూ సమానమే దానికోసం ఎస్ఎఫ్ఐ ముందుండి పోరాడుతుందని, పాలక ప్రభుత్వాలు విద్యను అందరిని ద్రాక్షలాగా చేస్తుందని విద్య అనేది సరుకుగా మారిన పరిస్థితి ఉన్నది, ప్రభుత్వ విద్యను ప్రైవేటీకరణ చేస్తున్న ప్రభుత్వాలు మన ముందున్నాయి, సమస్యలే కాకుండా విద్యార్థులు దాగి ఉన్న సృజనాత్మక తీయడం కోసం నిరంతరం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, త్వరలో రాబోయే పదవ తరగతి పరీక్షలను ఎలాంటి మానసిక ఒత్తిడి లేకుండా ధైర్యంగా రాసి ఫలితాలు సాధించాలని తల్లిదండ్రుల కళల్ని నిలబెట్టాలని అన్నారు. విద్యార్థులు ముందుగా భయాన్ని విడిచిపెట్టి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలన్నారు, విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ నిర్వహించడ జరుగుతుంది, చదివే అన్నింటికీ మూలమని ఉన్నతంగా చదివి జీవితంలో మంచి స్థానంలో ఉండాలని అన్నారు.ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలని సమయాన్ని వృధా చేసుకోవద్దని పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ చేసే కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.



