- Advertisement -
జాతీయ మినీ ఫెన్సింగ్‌లో ఆరు పతకాలు
నవతెలంగాణ-హైదరాబాద్ :
జాతీయ చైల్డ్, మినీ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ చిన్నారులు సత్తా చాటారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన పోటీల్లో బాలికలు, బాలుర విభాగాల్లో తెలంగాణ ఆరు పతకాలు సాధించింది. బాలికల చైల్డ్ ఈపీల తనిష్క గుండు, బాలుర చైల్డ్ ఫాయిల్‌లో గుమ్మడి రేయాన్షు పసిడి పతకాలు గెల్చుకున్నారు. బాలికల మినీ ఫాయిల్‌లో సారా, బాలుర మినీ ఈపీలో ఆయాన్షు కుమార్ గుండు సిల్వర్ మెడల్స్ దక్కించుకోగా.. ఆరుషి (బాలికల మినీ ఈపీ), ఈమన్ నౌరా (బాలికల చైల్డ్ ఫాయిల్) కాంస్య పతకాలు సాధించారు. పతక ప్రదర్శన చేసిన చిన్నారి ఫెన్సర్లను తెలంగాణ ఫెన్సింగ్ సంఘం అభినందించింది.
- Advertisement -