Saturday, May 24, 2025
Homeజాతీయంమైసూర్ శాండ‌ల్ అంబాసిడ‌ర్‌గా త‌మ‌న్నా.. ఎంపీ వార్నింగ్‌!

మైసూర్ శాండ‌ల్ అంబాసిడ‌ర్‌గా త‌మ‌న్నా.. ఎంపీ వార్నింగ్‌!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటీవ‌ల ప్ర‌ముఖ న‌టి త‌మ‌న్నా భాటియాను క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం మైసూర్ శాండ‌ల్‌, శ్రీగంధ‌ముకు బ్రాండ్‌ అంబాసిడ‌ర్‌గా నియ‌మించిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిపై అక్క‌డ తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది. త‌మ‌న్నాకు క‌ర్ణాట‌కు ఏమాత్రం సంబంధం లేద‌ని, లోక‌ల్ క‌థానాయిక‌ను బ్రాండ్‌సింబ‌డ‌ర్‌గా చేయాల‌నే డిమాండ్ గ‌ట్టిగా వినిపిస్తోంది. ప్ర‌ధానంగా బీజేపీ పార్టీ నేత‌లు ఈ విషయాన్ని తెర‌పైకి తీసుకువ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో తాజాగా ఎంపీ కృష్ణ‌ద‌త్త ఒడేయ‌ర్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. మిల్కీబ్యూటీకి క‌న్న‌డ రాదంటూ, ఆమె బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా అస‌లు వ‌ద్ద‌ని అన్నారు. త‌మ‌న్నాను అంబాసిడ‌ర్‌గా కొన‌సాగిస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని ఎంపీ హెచ్చ‌రించారు. త‌మ పూర్వీకుడు కృష్ణ‌రాజు ఒడేయ‌ర్ 1916లో పెట్టిన మైసూర్ కంపెనీకి ప‌ర‌భాష న‌టుల‌ను అంబాసిడ‌ర్‌గా పెట్ట‌డం ఏంట‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -