ఐసీయూలో చికిత్స
పరామర్శించిన రాఘవులు, జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం గుండె జబ్బుతో బాధపడుతూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల్లో నీరు, తదితర సమస్యలతో తమ్మినేని ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయనను సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, కార్యదర్శి వర్గ సభ్యులు టీ సాగర్, ఎండీ అబ్బాస్, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, ఆర్ వెంకట్రాములు, పి.జయలక్ష్మి పరామర్శించారు. అవసరమైన చికిత్సను అందిస్తున్నామనీ, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని రెండు రోజుల్లో కోలుకుంటారని వైద్యులు వివరించారని జాన్‌వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గచ్చిబౌలి ఏఐజీలో తమ్మినేని
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



