Sunday, November 23, 2025
E-PAPER
Homeజాతీయంబయో డీజిల్‌ బంకులో పేలిన ట్యాంకర్‌..

బయో డీజిల్‌ బంకులో పేలిన ట్యాంకర్‌..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : ఏపీలోని పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలంలోని పాలువాయి జంక్షన్‌లో బయో డీజిల్‌ బంకులో ట్యాంక్‌ పేలింది. దాంతో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డట్లుగా సమాచారం. మృతుడిని రఫీగా గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -