చర్లపల్లి ప్లాంట్లలో తగ్గిన గ్యాస్ సరఫరా
ఇంధన కొరతతో వ్యాపారులు, వాహనదారుల ఇబ్బందులు
టోకెన్లతో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ
నవతెలంగాణ – చర్లపల్లి
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ యుద్ధం వల్ల అంతర్జాతీయంగా చమురు సరఫరా దెబ్బతిన్నది. ఈ ఉద్రిక్తతల ప్రభావం ముందుగా గ్యాస్ కంపెనీలపై తీవ్రంగా పడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా చర్లపల్లిలోని భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్లాంట్లలో ఇంధన సరఫరా భారీగా తగ్గింది. గతంతో పోలిస్తే సుమారు 50శాతం వరకు సరఫరా తగ్గినట్టు సమాచారం. ఈ మూడు ప్లాంట్ల నుంచి ఏపీ, కర్నాటక, మహారాష్ట్రకు ఇంధన సరఫరా జరుగుతోంది. ప్రస్తుతం సరఫరా తగ్గడంతో ట్యాంకర్లు, ఇతర వాహనాలు ప్లాంట్ల వద్దే పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కంపెనీలు టోకెన్ల వారీగా పరిమితంగా అందజేస్తుండటంతో వాహనదారులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంట గ్యాస్ కోసం బారులు తీరిన ట్యాంకర్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



