Sunday, February 22, 2026
E-PAPER
Homeపరిశోధనరాచకొండగుట్టల్లో తాంత్రిక భైరవుడు

రాచకొండగుట్టల్లో తాంత్రిక భైరవుడు

- Advertisement -

రణంకుడుపు భైరవారాధన
కొత్త తెలంగాణ చరిత్ర బందం సభ్యుడు కావలి చంద్రకాంత్‌ రాచకొండగుట్టల్లో తాను దర్శించిన భైరవశిల్పం గురించి సమీక్షించాడు.
రాచకొండగుట్టల్లోని భోగందాని మంటపం, గణపతి శిల్పాల నడుమ పెద్దరాతిగోడమీద చెక్కివున్న 9 అడుగుల ఎత్తున్న భైరవుని ఉల్బణశిల్పం చాలా ప్రత్యేకమైంది. ఈ స్థానక భైరవుడు ద్విభంగిమలో, వైతస్తిక పాదాలతో నిల్చున్న చతుర్భుజుడు. పరహస్తాల్లో ఢమరుకం, త్రిశూలాలు, నిజహస్తాల్లో బలిఖడ్గం, రక్తపాత్ర, ఖండిత శిరస్సులున్నాయి. ఆ శిరస్సు కింద రక్తంకోసం పైకెగురుతున్న శ్వానం కనిపిస్తున్నది. ఆ పక్కన ఒక భక్తుడు సాగిలపడి మొక్కుతున్నాడు. భైరవునికి కుడిపక్కన మరిగాలు పెట్టి, యోగబంధంతో కూర్చున్న రాజోపాసకుడు పాత్రలోని రక్తప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు. అతడు పులిచర్మం మీద కూర్చున్నట్టున్నది. ఇది రాచకొండవెలమల ‘రణంకుడుపు’లను గుర్తు తెస్తున్నదని చరిత్రబందం కన్వీనర్‌ శ్రీరామోజు హరగోపాల్‌ అభిప్రాయపడ్డారు.
భైరవుని తలమీద రెండుసర్పాలల్లుకున్న నాగతోరణం, భైరవునికి నాగకిరీటం ఉంది. నోట్లో కోరలున్నాయి. భైరవునికి చెవులకు నాగాభరణాలు, మెడలో హార,గ్రైవేయకాలు, వక్షంమ్మీద, మోకాళ్ళమీద నాగబంధాలు, చేతులకు కంకణాలు, కాళ్ళకు కడియాలు, ఎత్తులు కట్టిన పాదుకలున్నాయి. ఈ భైరవుడు కాకతీయానంతరశైలి తాంత్రికభైరవుడు. రాచకొండ వెలమలు భైరవోపాసకులుగా ప్రసిద్ధులు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -