Sunday, April 12, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీఎంటీఏటీఎస్‌ అధ్యక్షునిగా తరాల జగదీశ్‌

పీఎంటీఏటీఎస్‌ అధ్యక్షునిగా తరాల జగదీశ్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మరోసారి ప్రోగ్రెసివ్‌ మోడల్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా తరాల జగదీష్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లో అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అప్పాల అశోక్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీష్‌ మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచి రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నుకున్న ప్రతి మోడల్‌ ఉపాధ్యాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. వారికి అండగా ఉంటానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -