నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పొరేషన్ పతాకాలపై రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మిస్తున్న భారీ బడ్టెట్ చిత్రం ‘ద్రౌపది2’. రక్షణ ఇందుసుదన్ హీరోయిన్‌గా నటిస్తోంది. వీరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను, నెలరాజె.. అనే పాటను ఇప్పటివరకు విడుదల చేయగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో బుధవారం మేకర్స్ ‘తారాసుకి..’ అనే పాటను రిలీజ్ చేశారు. ఇందులో మహ్మద్‌బీన్ తుగ్లక్‌గా నటిస్తున్న చిరాగ్ జానీపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాట కోసం భారీ సెట్‌ను నిర్మించారు. పీరియాడిక్ టచ్‌తో సాగే ఈ సాంగ్ మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. జిబ్రాన్ సంగీత సారథ్యంలో చిత్ర దర్శకుడు మోహన్.జి. రాసిన ఈపాటను జిబ్రాన్, గోల్డ్ దేవరాజ్, గురు హరిరాజ్ ఆలపించారు.
నట్టి నటరాజ్ కీలక పాత్ర పోషిస్తుండగా, వైజి మహేంద్రన్, నడోడిగల్ బరాణి, శరవణ సుబ్బయ్య, వెల్.రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్‌లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఫిలిప్ ఆర్.సుందర్, సంగీతం : జిబ్రాన్, యాక్షన్ : సంతోష్, నృత్యాలు :తనిక టోని, ఎడిటింగ్ : దేవరాజ్, ప్రొడక్షన్ డిజైనర్ : కమల్‌నాథన్, డైలాగ్స్ : పద్మ చంద్రశేఖర్, మోహన్ జి. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈచిత్రం నుంచి త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ పై కూడా ప్రకటన రానుందని చిత్రబృందం తెలిపింది.
పీరియాడిక్ టచ్‌తో ‘తారాసుకి..’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



