Tuesday, March 17, 2026
E-PAPER
Homeఆటలుటార్గెట్‌ క్రిస్‌ గేల్‌ 175

టార్గెట్‌ క్రిస్‌ గేల్‌ 175

- Advertisement -

యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ

న్యూఢిల్లీ : ఐపీఎల్‌లో వేగవంతమైన సెంచరీ? ఓ ఓవర్లో ఆరు సిక్సర్లు? ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్‌ గేల్‌ 175?.. బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో వైభవ్‌ సూర్యవంశీని వ్యాఖ్యాత హర్ష భోగ్లే అడిగిన ప్రశ్నలు ఇవి. చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీ.. వెంటనే క్రిస్‌ గేల్‌ 175 రికార్డుపై కన్నేసినట్టు సమాధానం ఇచ్చాడు. భారత్‌-ఏ తరఫున 144 పరుగులు బాదిన వైభవ్‌ సూర్యవంశీ.. తాజాగా ఐపీఎల్‌లో గేల్‌ 66 బంతుల్లో 175 పరుగుల రికార్డుపై గురి పెట్టాడు. ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో క్రిస్‌ గేల్‌ 175 (2013లో ఆర్‌సీబీ తరపున పుణె వారియర్స్‌పై) అత్యధిక స్కోరు కాగా.. 2018లో జింబాబ్వేపై అరోన్‌ ఫించ్‌ 172 పరుగుల ఇన్నింగ్స్‌ ద్వితీయ స్థానంలో ఉంది. ‘ఐపీఎల్‌ 2026 టైటిల్‌ నెగ్గటం అన్నింటికంటే ముఖ్యమైన టార్గెట్‌. జట్టు విజయాల్లో భాగస్వామ్యం కావటం, జట్టును ట్రోఫీ అందించటమే లక్ష్యమని’ వైభవ్‌ తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -