నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్: కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఐకేపీ ఆధ్వర్యంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరించడమే లక్ష్యమని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ తెలిపారు. ఆయన గురువారం నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పెట్ లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన తేమ శాతం గుర్తించే యంత్రాన్ని పరిశీలించి దాన్యం తూకం వేయించారు. అయితే మ్యాచర్ పేరుతో మాచారెడ్డి మండలంలోని భవానిపెట్ లో గల లక్ష్మీ రైస్ మిల్ యజమానులు వేధిస్తున్నారని, బుధవారం వడ్ల లోడుతో వెళ్లిన లారీ ఇప్పటికి తిరిగి రాలేదని మ్యాచర్ పేరుతో లారీ వడ్ల లోడులో 20 క్వింటాళ్ల దాన్యం తొలగిస్తామని రైస్ మిల్ యజమానులు తమతో అన్నారని పిర్యాదు చేశారు. అంతేగాక దాన్యం ముక్క ఉందని మరోసారి ఫోన్ చేసినట్టు పీడీ కి రైతులు పిర్యాదు చేశారు. ఆయన వెంటనే కామారెడ్డి డీసీవో కు ఫోన్ ద్వారా తెలిపి వివరాలు తెలుపాలని ఆదేశించారు. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగొద్దని, వారి క్షేమమే ముఖ్యమని తెలిపారు. రైతులు వరి పంట పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాత కోత వేయాలని సూచించారు. మ్యాచర్ కూడా 17 శాతానికి లోబడి ఉండాలని సూచించారు. ప్రస్తుతం సివిల్ సప్లై శాఖ ద్వారా వచ్చిన గన్ని బ్యాగులలో 42 కిలోల దాన్యం నిండడం లేదని వీటిని మార్చాలని అధికారికి సూచించారు.
15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరణ లక్ష్యం
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరణ లక్ష్యమని పీడీ సురేందర్ తెలిపారు. అందుకోసం జిల్లాలో 194 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రానున్న సీజన్ లో ఇవి ఇంకా ఎక్కువ సంఖ్యలో కేంద్రాలను తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల ద్వారా నేటి వరకు 5,572 క్వింటాళ్ల దొడ్డు రకం దాన్యం సేకరించామని, సన్నరకం దాన్యం2,462 క్వింటాళ్లు సేకరించామని అన్నారు. సన్న రకం వడ్లు కొనుగోలు చేయడానికి జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
62 శాతం మహిళల యూనిఫామ్..
జిల్లాలో ఇప్పటి వరకు మహిళల కోసం పంపిణీ చేసేందుకు యూనిఫామ్ లు 62 శాతం మాత్రమే సరఫరా చేశారని డీఆర్డీవో పీడీ సురేందర్ తెలిపారు. జిల్లాలో 2,3,689 యూనిఫాంలు అవసరం కాగా 1,25,525 మాత్రమే చేరుకున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఐకేపీ గోదాముల్లో కామారెడ్డిలో, బీర్కూర్, బిక్కనూర్, తాడ్వాయి, మాచారెడ్డి, నాగిరెడ్డిపేట, బిచ్కుంద గోదాముల్లో నిలువ ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీపీఎం సాయులు, ఏపీఎం రాం నారాయణ గౌడ్ సీసీ రమేష్ ఉన్నారు.
ఐకేపీ ఆధ్వర్యంలో 15 లక్షల క్వింటాళ్ల దాన్యం సేకరణ లక్ష్యం: డీఆర్డీవో సురేందర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



