No menu items!
Saturday, August 23, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeఅంతర్జాతీయంసుంకాల గ‌డువు మార‌దు: ట్రంప్

సుంకాల గ‌డువు మార‌దు: ట్రంప్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: టారిఫ్‌ల డైడ్ లైన్‌లో ఎలాంటి మార్పు ఉండ‌ద‌ని, ఆగస్టు 1నాటి తుది గడువు ఎట్టి పరిస్థితుల్లో మారదని, ఎలాంటి పొడగింపులు ఉండవని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ‘‘ఇక పొడగింపులు లేవు, ఇక గ్రేస్ పిరియడ్‌లు లేవు. ఆగస్టు 1న, సుంకాలు నిర్ణయించబడ్డాయి. అవి అమలులోకి వస్తాయి. కస్టమ్స్ డబ్బు వసూలు చేయడం ప్రారంభిస్తాయి.’’ అని ఓ అన్నారు.

మరోవైపు, సుంకాల గురించి యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్‌తో స్కాట్లాండ్‌లో ఆదివారం చర్చలు జరిపారు. యూరోపియన్ యూనియన్ ఒప్పందం కుదుర్చుకుంటారని ఆశిస్తున్నామని, ఈ చర్చలకు నాయకుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఇది ఆధారపడి ఉంటుందని, చర్చలను ఏర్పాటు చేసింది మేమే అని లుట్నిక్ అన్నారు. శుక్రవారం గడువు ముగియకముందే ఐదు దేశాలు అమెరికాతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. బ్రిటన్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, జపాన్ ఈ దేశాల జాబితాలో ఉన్నాయి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad