Monday, July 7, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంసుంకాల పెంపు..డబ్ల్యుటీఓ రూల్స్‌కు విరుద్ధం: బ్రిక్స్‌

సుంకాల పెంపు..డబ్ల్యుటీఓ రూల్స్‌కు విరుద్ధం: బ్రిక్స్‌

- Advertisement -


నవతెలంగాణ-హైద‌రాబాద్:
ఇరాన్‌పై సుంకాల పెరుగుదల, దాడులను వర్తమాన, అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్‌ తీవ్రంగా ఖండించింది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరును ప్రస్తావించలేదు. అమెరికాపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ.. సుంకాల పెరుగుదల ప్రకటన ” తీవ్ర ఆందోళనలను” లేవనెత్తిందని తెలిపింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఈ పరిమితులు ప్రపంచ వాణిజ్యాన్ని తగ్గించడానికి, ప్రపంచ సరఫరా గొలుసును దెబ్బతీసేందుకు మరియు అనిశ్చితి ముప్పును కలిగిస్తాయని బ్రిక్స్‌ పేర్కొంది.
‘బ్రిక్స్‌ యొక్క అమెరికా వ్యతిరేక విధానాలు’గా పేర్కొంటూ ఆ కూటమితో ఏ దేశమైనా పొత్తు పెట్టుకుంటే దానిపై అదనంగా 10శాతం సుకం విధించబడుతుందని తన సోషల్‌మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

ఇజ్రాయిల్‌ దాడులకు ముందు బ్రిక్స్‌ సమావేశానికి హాజరుకావాలని ఇరాన్‌ అధ్యక్షుడు మసౌద్‌ పెజిష్కియన్‌ హాజరుకావాలని భావించారు. ఉద్రిక్తతలు నెలకొనడంతో విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఈ సమావేశానికి హాజరయ్యారు.

అబ్బాస్‌ అరాఘ్చీ మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితిలోని ప్రతి సభ్య దేశం ఇజ్రాయిల్‌ను ఖండించాలని ఒత్తిడి చేసినట్లు తెలిపారు. హక్కుల ఉల్లంఘనలకు ఇజ్రాయిల్‌, అమెరికా బాధ్యత వహించాలని ఆయన అన్నారు. యుద్ధం తర్వాత జరిగే పరిణామాలు ఒక దేశానికే పరిమితం కావు అని అరాఘ్చీ పేర్కొన్నారు. మొత్తం ప్రాంతం, వెలుపలి ప్రాంతాలు దెబ్బతింటాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -