వాషింగ్టన్ : రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై తాను విధించిన సుంకాలు వాషింగ్టన్, న్యూఢిల్లీ మధ్య సంబంధాలను దెబ్బతీశాయని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికా న్యూస్ నెట్‌వర్క్ ఫాక్స్ న్యూస్‌కు ఆయన శుక్రవారం ఇంటర్వ్యూ ఇస్తూ ‘చూడండి…రష్యాకు భారత్ అతి పెద్ద వినియోగదారు. రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నందున నేను భారత్‌పై యాభై శాతం టారిఫ్ విధించాను. అలా చేయడం అంత తేలికేమీ కాదు’ అని అన్నారు. న్యూఢిల్లీపై సుంకాలు విధించడం అతి పెద్ద పని అని తెలిపారు. దీనివల్ల భారత్‌తో విభేదాలు తలెత్తాయని చెప్పారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీనికి కారణం రష్యా నుంచి భారత్ చమురును కొనుగోలు చేయడమే. దీనిపై ఆగ్రహించిన ట్రంప్ భారత్‌పై ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో మొత్తం సుంకాల భారం యాభై శాతానికి చేరింది. భారత్ దిగుమతులు ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా భారత్, అమెరికా మధ్య జూలైలో ఐదో రౌండ్ వాణిజ్య చర్చలు జరిగాయి. ఆగస్టులో తదుపరి విడత చర్చలు జరగాల్సి ఉన్నప్పటికీ అవి రద్దయ్యాయి. తిరిగి ఎప్పుడు ప్రారంభమయ్యేదీ తెలియడం లేదు. వాణిజ్యంపై ప్రధాని మోడీతో త్వరలోనే చర్చలు జరుపుతానంటూ ట్రంప్ కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. దీనిపై మోడీ కూడా సానుకూలంగానే స్పందించారు.
భారత్‌పై సుంకాల విధింపు అతి పెద్ద పని : ట్రంప్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES