- Advertisement -
యూఎస్ మంత్రి సంకేతాలు
న్యూయార్క్ : భారత్‌పై అమెరికా వేసిన సుంకాల్లో తగ్గుదల ఉండొచ్చని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ సూచనప్రాయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధిస్తోంది. రష్యా చమురును కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలు విధించామని స్కాట్ బెసెంట్ తెలిపారు. కాగా.. రష్యా చమురు కొనుగోళ్లను భారత్ తగ్గించు కుందని.. ఇది తమ విజయమన్నారు. చమురు దిగుమతి తగ్గించుకున్నప్పటికీ అదనపు టారిఫ్‌లు అమల్లో ఉన్నాయన్నారు. వాటిని తొలగించడానికి ఒక అవకాశం ఉందని తాను భావిస్తున్నానన్నారు.
- Advertisement -



