Saturday, January 31, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంక్యూబాకు చమురు ఇస్తే టారిఫ్‌లు !

క్యూబాకు చమురు ఇస్తే టారిఫ్‌లు !

- Advertisement -

వాషింగ్టన్‌ : క్యూబాకు చమురును విక్రయించే లేదా అందించే దేశాల నుండి వచ్చే ఉత్పత్తులపై టారిఫ్‌లు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చ రించారు. ఇప్పటికే తీవ్రమైన ఇంధన సంక్షోభంతో కొట్టుమిట్టా డుతున్న క్యూబాను ఈ చర్య మరింత ఇబ్బందుల్లోకి నెడుతుంది.
ఈ ఆదేశాలు ప్రాధమికంగా మెక్సికోపై ఒత్తిడిని పెంచుతాయి. ప్రస్తుతం క్యూబాకు చమురు జీవనాడిగా మెక్సికో ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అలాగే క్యూబాకు నిరంతరంగా సంఘీభావాన్ని కూడా ప్రదర్శిస్తూ వస్తోంది. క్యూబాను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తున్నారా అని ఒక విలేకరి ట్రంప్‌ను ప్రశ్నించగా, అది చాలా కఠినమైన పదమని వ్యాఖ్యానించారు. ‘నేను అలా ప్రయత్నించడం లేదు, కానీ మనుగడ సాగించేలా అది కనిపించడం లేదు.’ అని ట్రంప్‌ వ్యాఖ్యా నించారు. కాగా ట్రంప్‌ ఉత్తర్వులను క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రొడ్రిగజ్‌ తీవ్రంగా ఖండించారు. క్యూబాపై, క్యూబన్లపై తీవ్రమైన దురాక్రమణ చర్య అని వ్యాఖ్యానించారు. క్యూబాకు సంఘీభావంగా నిలిచే దేశాలను బ్లాక్‌మెయిల్‌ చేసే చర్యలకు ట్రంప్‌ పాల్పడుతున్నారని విమర్శించారు. గురువారం ఉదయం మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షబ్నంతో ట్రంప్‌ ఫోన్లో మాట్లాడారు. కాగా తాము క్యూబాపై చర్చలు జరపలేదని ఆమె చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -