భారత్ తరఫున హాజరుకానున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
న్యూఢిల్లీ : పొరుగుదేశం బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిక్ రెహమాన్ ఈనెల 17న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని బంగ్లాదేశ్ పార్లమెంటు హౌస్‌లోని సదరన్ ప్లాజాలో నిర్వహించనున్నారు. ఇందులో పాల్గొనాలని యూనస్ నేతృత్వం లోని తాత్కాలిక ప్రభుత్వం చైనా, సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ, ఖతార్, శ్రీలంక, నేపాల్, భారత్ సహా 13 దేశాలకు ఆహ్వానం పంపింది. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా భారత ప్రధాని మోడీకి ఆహ్వానం అందినట్టు వెల్లడించింది. అయితే ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ భారత పర్యటకు వస్తుండడంతో మోడీ ఢాకాకు వెళ్లే అవకాశం లేదని భారత అధికారులు వివరించారు. అందువల్ల భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు. భారత విదేశాంగశాఖ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.



