- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణం నుండి బాల్కొండ కు వెళ్తుండగా టాటా ఏస్ వాహనం అదుపు తప్పి చేపూర్ బైపాస్ వద్ద మంగళవారం బోల్తా పడింది. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆంబులెన్స్ లో చికిత్స కోసం పట్టణ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాము బాల్కొండలో స్లాబ్ నిర్మాణానికి వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుందని క్షతగాత్రుల బంధువులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -