హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో భారీగా మెగా చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించినట్లు విద్యుత్ కార్ల తయారీదారు టాటా ఇవి వెల్లడించింది. వోల్ట్రాన్‌తో ఒప్పందం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 14 మెగాచార్జర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొంది. వోల్ట్రాన్‌తో భాగస్వామ్యం ద్వారా అందుబాటులోకి తెచ్చిన ఇవి పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో ఇవి కార్లను సులభంగా చార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. వీటితో దేశ వ్యాప్తంగా 70కి పైగా చార్జింగ్ స్టేషన్లకు విస్తరించినట్లయ్యిందని పేర్కొంది.
జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపునతో ద్రవ్యోల్బణానికి ఊరట
జీఎస్‌టీ శ్లాబుల తగ్గింపునతో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. ఇంతకాలం అధిక జీఎస్‌టీ పన్ను రేట్లతో ద్రవ్యోల్బణం ఎగిసిపడేలా చేసిన మోడీ సర్కార్.. ఇటీవల పలు ఒత్తిడితో జీఎస్‌టీి శ్లాబులను 5, 12 శాతాలకు తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది అక్టోబర్‌లో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ (సిపిఐ) 0.25 శాతానికి తగ్గిందని కేంద్ర గణంకాల శాఖ ఓ రిపోర్ట్‌లో తెలిపింది. ఇంతక్రితం సెప్టెంబర్‌లో సిపిఐ 1.54 శాతంగా నమోదయ్యింది. గడిచిన అక్టోబర్‌లో కూరగాయలు, పళ్లు ధరలు తగ్గడంతో ఆహార ద్రవ్యోల్బణం సూచీ మైనస్ 5.02 శాతానికి పడిపోయింది.
టాటా ఇవి చార్జింగ్ స్టేషన్ల విస్తరణ
- Advertisement -
- Advertisement -



