నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాలుగా రూ.8500 కోట్ల స్కాలర్షిప్ లు పెండింగ్లో ఉన్నాయని టీఏవీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం తనుష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాటిని చెల్లించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 30న ఎస్ఎఫ్ఐ తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యసంస్థల బందుకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. స్కాలర్ షిప్ లు పెండింగ్ ఉండడంతో ఉన్నత చదువులు పూర్తి చేసుకున్న పేద మధ్యతరగతి విద్యార్థులు తమ ధృవపత్రల కోసం కాలేజి యాజమాన్యలకు వేల ఫీజులను కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొందరు మధ్యలోనే చదువులు ఆపేస్తున్నారన్నారు. రెండు నెలల క్రితం విద్యార్థి సంఘాలు, కాలేజి యాజమాన్య సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపట్టారన్నారు.ఈ నిరసనలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.1200 కోట్లను త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంకా విడుదల చేయలేదని వాపోయారు. వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
30న విద్యాసంస్థల బంద్ కు టీఏవిఎస్ మద్దతు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



