నవతెలంగాణ – రెంజల్
రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం టి బి ముక్తి భారత అభియాన్ కార్యక్రమాన్ని డాక్టర్ సహిస్తా పిర్దోష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. దుర్ఫలమైన కేటగిరికి చెందిన ప్రజలకు దమ్ము, దగ్గు, తో బాధపడుతున్న వారికి, గుట్కా, సిగరెట్, బీడీ, జర్ధ, ద్వారా ఇబ్బంది పడుతున్న ప్రజలకు, రక్త, ఉమ్ము, ఎక్స్రే పరీక్షలను నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు.
టిబి సోకిన వారు భయపడవలసిన అవసరం లేదని ఆరు మాసాలు మందులు వాడితే పూర్తిగా నయమవుతుందని డాక్టర్ పేర్కొన్నారు. వారు పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అన్నారు. అట్టి వారిని గుర్తించి వారికి పౌష్టికాహార కిడ్స్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సైస్త ఫిర్దోష్, ఆరోగ్య విస్తీర్ణ అధికారి కరిపే రవీందర్, టిబి సూపర్వైజర్ ఆశాన్, ఎక్స్ రే టెక్నీషియన్ సురేందర్, పీహెచ్ ఎన్ రాణి, ఆరోగ్య సూపర్వైజర్ మాలంబి, ఎం ఎల్ హెచ్ పి ఇమ్రాన్, లక్ష్మీనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ సాయి కిరణ్, ఐ సి డి స కౌన్సిలర్ శివ, ఆరోగ్య కార్యకర్తలు, ఆశలు, పాల్గొనగా, లయన్స్ క్లబ్ అయ్యప్ప స్వామి ప్రతినిధులు శ్రీనివాస్ సత్య స్వామి, పండ్ల రసాలను అందజేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్తి భారత్ అభియాన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES