Friday, April 10, 2026
E-PAPER
Homeబీజినెస్టీసీఎస్‌ నికర లాభాలు రూ.13,718 కోట్లు

టీసీఎస్‌ నికర లాభాలు రూ.13,718 కోట్లు

- Advertisement -

ప్రెతీ షేర్‌పై రూ.31 డివిడెండ్‌
న్యూఢిల్లీ :
దేశంలోనే అతిపెద్ద టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ నికర లాభం 12.22 శాతం వృద్ధితో రూ.13,718 కోట్లకు చేరింది. ఆదాయం 10 శాతం పెరిగి రూ.70,698 కోట్లుగా నమోదయ్యింది. తుది డివిడెండ్‌ కింద ఒక్కో షేరుకు రూ.31 ప్రకటించింది.

గడిచిన త్రైమాసికంలో ఏకంగా 12 బిలియన్‌ డాలర్ల విలువైన కొత్త ఒప్పందాలను కుదుర్చుకున్నట్టు టీసీఎస్‌ వెల్లడించింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) సేవల ద్వారా వచ్చే వార్షిక ఆదాయం 2.3 బిలియన్‌ డాలర్లు దాటిందని తెలిపింది. క్యూ4లో కంపెనీ నికరంగా 2,000 మందికి పైగా కొత్త ఉద్యోగులను చేర్చుకోవడంతో మొత్తం సిబ్బంది సంఖ్య 5,84,519కి చేరింది. గురువారం బీఎస్‌ఈలో టీసీఎస్‌ షేర్‌ 1.09 శాతం పెరిగి రూ.2,587.75 వద్ద ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -