Monday, July 21, 2025
E-PAPER
Homeఖమ్మంపైపు లైన్ నిర్మాణానికి టీడీపీ విరాళం...

పైపు లైన్ నిర్మాణానికి టీడీపీ విరాళం…

- Advertisement -

పాఠశాలను సందర్శించిన నాయకులు…
నవతెలంగాణ – అశ్వారావుపేట

మండలంలోని ఆసుపాక ఎంపీపీ ఎస్ లో పైప్ లైన్ నిర్మాణానికి తెదేపా ఆద్వర్యంలో నాయకులు రూ.10 వేలు విరాళం ను హెచ్ ఎం విజయలక్ష్మి కి అందజేసారు. తెలుగుదేశం పార్టీ నాయకులు పాఠశాల సందర్శించి సమస్యలను తెలుసుకున్నారు. బోర్ వెల్ నుండి మూత్రశాల వరకు పైపులైను లేదని తెలుసుకున్న నాయకులు తమ వంతు ఆర్ధిక సహాయంగా పార్టీ తరపున  రూ.10,000  హెచ్ఎం కు అందజేసారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -