Sunday, October 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు 

బీసీ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు 

- Advertisement -

మండల అధ్యక్షుడు బైన బిక్షపతి 
నవతెలంగాణ -పెద్దవంగర
బీసీ రిజర్వేషన్లు 42 శాతం సాధన కోసం తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ నేడు తలపెట్టిన రాష్ట్ర బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జనాభా దామాషా ప్రకారం వాటా అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సరైన వాటా ఇవ్వకుండా సంక్షేమ పథకాలు ప్రవేశపెడితే లబ్ధిదారులకు ఎలా చేరుతాయని ప్రశ్నించారు? జనాభా ప్రకారం రిజర్వేషన్లు కల్పించినప్పుడే అట్టడుగు స్థాయి నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రాణిస్తారని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఖరి మార్చుకోవాలని, వెంటనే 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -