Sunday, September 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ టీడీపీ

బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ టీడీపీ

- Advertisement -

జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు
నవతెలంగాణ – చండూరు 

బడుగు బలహీన వర్గాలకు చెందిన  పార్టీ టీడీపీ అని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కని నర్సింహులు అన్నారు. ఆదివారం  గట్టుప్పల మండలంలోని  వెల్మకన్నే గ్రామంలో టీడీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో   టీడీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన టీడీపీ సమావేశంలో వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పెదల భూముల లాక్కోవడం అలైన్మెంట్ మార్పు చేసి రైతులని ఇబ్బంది పెట్టడం సరికాదని అన్నారు. రైతుల పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. జాతీయ అధ్యక్షుడు  చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే హైదరాబాద్ అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి అన్ని విధాలా అభివృద్ధి జరిగిందని అన్నారు.ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య వాదిగా  పేరొందిన గొప్ప వ్యక్తి  అని అన్నారు.

నల్గొండ పోరాటల గడ్డ గతంలో ఎన్టీఆర్ పోటీ చేసిన ప్రాంతమని గుర్తు చేశారు.  చంద్రబాబు నిర్ణయం మేరకు వచ్చే స్థానిక ఎన్నికల్లో పోటీ ఉంటుందన్నారు.  పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కలిసి పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంటు మాజీ అధ్యక్షుడు కుందారపు కృష్ణమాచారి,  నియోజకవర్గ ఇంచార్జి బడుగు లక్ష్మయ్య, టీడీపీ  రాష్ట నాయకులు గోసుకొండ వెంకటేశం, కొలను వేణుగోపాల్ రెడ్డి, ఎండి షరీఫ్,మండల అధ్యక్షుడు  గడ్డం, కృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి ఎండి పాషా, పెట్టుగాళ్ల ఆంజయ్య, పార్వతమ్మ , కంప శ్రీషేలం, మురళీధర్, జయేందర్ ,చింతకాయల రాజు, సూరపల్లి నరసింహ, అన్ని మండలల అధ్యక్షులు,గ్రామశాఖ అధ్యక్షులు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -