Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంపులివెందుల, ఒంటిమిట్ట టిడిపి కైవసం

పులివెందుల, ఒంటిమిట్ట టిడిపి కైవసం

- Advertisement -

– పులివెందుల్లో వైసిపికి డిపాజిట్‌ గల్లంతు
– కౌంటింగ్‌ను బారుకాట్‌ చేసిన వైసిపి
కడప:
ఉమ్మడి వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్‌పిటిసి స్థానాలకు నిర్వహించిన ఉప ఎన్నికల్లో టిడిపి భారీ మెజార్టీతో విజయాన్ని సాధించింది. గురువారం మను పాలిటెక్నిక్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. పులివెందుల స్థానానికి 7,794 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 11, 145 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. నోటా, తిరస్కరణకు గురైన ఓట్లుపోగా 7,638 ఓట్లు లెక్కించారు. టిడిపి అభ్యర్థి మారెడ్డి లతకు 6,716 ఓట్లు పడ్డాయి. వైసిపి అభ్యర్థి తుమ్మల హేమంత్‌ రడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే లభించాయి. వైసిపి అభ్యర్థి డిపాజిట్‌ కూడా గల్లంతైంది. ఒంటిమిట్ట జడ్‌పిటిసి స్థానానికి 20 వేల ఓట్లు పోల్‌కాగా, నోటా 29, తిరస్కరణకు గురైన 582 ఓట్లు పోగా 19,389 ఓట్లను లెక్కించారు. మొదటి రౌండులో 9,703 ఓట్ల లెక్కింపులో టిడిపి అభ్యర్థి అద్దలూరు ముద్దు కృష్ణారెడ్డికి 6,270 ఓట్లు పడ్డాయి. వైసిపి అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి 3,165 ఓట్లు పోలయ్యాయి. రౌండవ రౌండ్‌లో 9,686 ఓట్లలో టిడిపికి 6,235 ఓట్లు, వైసిపికి 3,186 ఓట్లు పోలయ్యాయి. మూడు రౌండ్ల కలిపి లెక్కిస్తే టిడిపికి 12,505 ఓట్లు లభించగా వైసిపికి 6,351 ఓట్లు లభించాయి. టిడిపి అభ్యర్థి కృష్ణారెడ్డి 6,154 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. గెలుపొందిన అభ్య ర్థులకు ఎన్నికల అధికారులు ధృవీకరణ పత్రాలను అందజేశారు. కౌంటింగ్‌ను వైసిపి బాయ్కట్‌ చేసింది. ఉమ్మడి కడప జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల టిడిపి జడ్‌పిటిసి అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో టిడిపి శ్రేణులు బాణాసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నాయి. పులివెందుల టిడిపి అభ్యర్థి గెలుపు పట్ల మంత్రి సవిత, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad