Monday, April 13, 2026
E-PAPER
Homeజాతీయం'టీ తాగేవారు గోహంతకులు..'

‘టీ తాగేవారు గోహంతకులు..’

- Advertisement -

సాధ్వి శ్రద్ధా గోపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ :
టీ తాగేవారు గోహంతకులని, హిందువులు టీ తాగకూడదని దీదీగా ప్రసిద్ధి చెందిన మత ప్రచారకురాలు సాధ్వి శ్రద్ధా గోపాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాధ్వి శ్రద్ధా తన అనుచరులతో మాట్లాడుతున్నప్పుడు ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. టీ తాగేవారిని గోహంతకులతో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మత ప్రచారకురాలు శ్రద్ధా గోపాల్‌ పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ”టీ తాగేవారే ఆవులను చంపేవారితో సమానం. మా తలలు పేలిపోయినా సరే మేము టీ తాగము,” అంటూ శ్రద్ధా గోపాల్‌ వ్యాఖ్యానించారు. టీ తాగకపోయినా మనుషులు సజావుగా జీవించగలరని, పూర్వీకులు కూడా టీ లేకుండానే జీవించారని ఆమె అన్నారు.ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్థం లేని వ్యాఖ్యలతో సమాజాన్ని విభజించే ప్రయత్నం జరుగుతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ప్రజల దష్టిని ఆకర్షించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -