Wednesday, August 20, 2025
E-PAPER
spot_img
Homeక్రైమ్గుండెపోటుతో ఉపాధ్యాయుడు ప్రసాద్ మృతి

గుండెపోటుతో ఉపాధ్యాయుడు ప్రసాద్ మృతి

- Advertisement -

– నివాళులు అర్పించిన కాంప్లెక్స్ హెచ్ఎం సుశీల
నవతెలంగాణ – అశ్వారావుపేట

గుండెపోటుతో ఐటీడీఏ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఎస్సార్పీ గడ్డం రాజబాబు తెలిపిన వివరాలు ప్రకారం మండలంలోని పాత రెడ్డిగూడెం పంచాయితీ బండారుగుంపు గిరిజన ప్రాథమిక పాఠశాల(జీపీఎస్)లో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న దారబోయిన ప్రసాద్(35) మంగళవారం విధులు ముగించుకుని ఆయన స్వగ్రామం అన్నపురెడ్డిపల్లి మండలం కట్టు గూడెం వెళ్లారు.

రోజువారీ మాదిరిగానే తన ఇంట్లోనే నిద్రించాడు. బుధవారం తెల్లవారుజామున తన తండ్రి ప్రసాద్ ను విధులకు వెళ్ళేందుకు నిద్ర లేపడానికి అని తన గదిలో కి వెళ్ళాడు.లేపడానికి పిలువగా అస్వస్థతకు గురైనట్లు గుర్తించి ఆస్పత్రికి తరలించేందుకు యత్నిస్తున్న సమయంలోనే పరిస్థితి విషమించి మృతి చెందాడు.మృతుడికి భార్య,ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నారు. కాంప్లెక్స్ హెచ్ఎం సుశీల,సహచర ఉపాద్యాయులు ప్రసాద్ భౌతిక కాయం సందర్శించి నివాళులు అర్పించారు.ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad