Friday, February 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుస్టూడెంట్‌ను కొట్టిన టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష

స్టూడెంట్‌ను కొట్టిన టీచర్‌కు మూడేళ్ల జైలు శిక్ష

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: విద్యార్థులపై హింసకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని గుజరాత్ కోర్టు స్పష్టం చేసింది. 2020లో గాంధీనగర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి విద్యార్థిని హోంవర్క్ చేయలేదన్న కారణంతో చెంపపై మూడుసార్లు కొట్టిన టీచర్‌కు కోర్టు 3.3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ దాడిలో విద్యార్థినికి కర్ణభేరి పగిలి శాశ్వతంగా చెముడు రావడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో గాంధీనగర్ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు వెలువరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -