లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున చారి
నవతెలంగాణ – పెద్దవంగర
ఉపాధ్యాయులు భావి సమాజ నిర్దేశకులని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడడంలో వారి పాత్ర ఎంతో గొప్పదని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు తంగెళ్లపల్లి మల్లికార్జున చారి, చార్టెడ్ ప్రెసిడెంట్ ఏదునూరి శ్రీనివాస్ అభివర్ణించారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన 12 ఉపాధ్యాయులను శాలువా, ప్రశంసా పత్రంతో సత్కరించారు. అనంతరం మండల విద్యాశాఖాధికారి బుధారపు శ్రీనివాస్, చిట్యాల కాంప్లెక్స్ హెచ్ఎం విజయ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. ఉపాధ్యాయులు కేవలం బోధించడమే కాకుండా, విద్యార్థులలో నైతిక విలువలు, శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం, సామాజిక స్పృహ వంటివి పెంపొందించి, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు.
లయన్స్ క్లబ్ పెద్దవంగర ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులకు, మహిళలకు రైతులకు, అట్టడుగు పేద బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన వారిలో రిటైర్డ్ హెచ్ఎం రవీందర్ రెడ్డి, వడ్డెకొత్తపల్లి హెచ్ఎం శేషవల్లి, ఉపాధ్యాయులు సదయ్య, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, సతీష్, దయాకర్, మధుసూదన్ రెడ్డి, రవి, వెంకన్న, సరిత, ప్రకాశ్ ఉన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు రాపోలు శ్రీనివాస్, ఎడవెల్లి మధుసూదన్ రెడ్డి, ముత్తినేని శ్రీనివాస్, జలగం సతీష్, మొర్రిగాడుదుల శ్రీనివాస్, సుభాష్ చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు సమాజ నిర్దేశకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES