లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ రాఘవరావు
నవతెలంగాణ-పాలకుర్తి
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులేనని, విద్యార్థిని, విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి ఆధ్వర్యంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం మండల కేంద్రంలో గల ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్ ఆఫ్ పాలకుర్తి అధ్యక్షులు చారగొండ్ల ప్రసాద్ తో కలిసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రాఘవరావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంలో ఉపాధ్యాయులు పక్షపాతం లేకుండా కృషి చేయడం అభినందనీయమన్నారు. ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని విద్యార్థులు అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. భారత మాజీ ప్రధాని టీవీ నరసింహారావును, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు లను ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు కృషి చేసింది ఉపాధ్యాయులేనని గుర్తు చేశారు.
ఉపాధ్యాయుల కృషి సమాజానికి ఆదర్శమన్నారు. యూనిట్ టెస్ట్ ల్లో ప్రతిభను కనబరుస్తున్న పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసి సన్మానించారు.ఈ కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి పబ్బా సంతోష్, జోన్ చైర్మన్ షీలా చంద్రశేఖర్, పిఆర్సి పల్లెపాటి జైపాల్ రావు, పిజెడ్‌సి నంగునూరి రవీందర్, పాస్ట్ ప్రెసిడెంట్ పన్నీరు సారంగపాణి, నాగమల్ల సోమేశ్వర్, అబ్బాస్ అలీ, ఉదయ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES