– ఎంఈఓను సన్మానించిన ఎమ్మెల్యే జారె
– పదవీ హోదా అధికారాలకు అతీతంగా గురువులకు గౌరవం
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఏ తరంలోనైనా భవిష్యత్ సమాజాన్ని సమగ్రంగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే నని, వీరికి పదవీ హోదా అధికారాలకు అతీతంగా “సర్” అనే గౌరవ వాక్కుతో సంబోధిస్తారు అని స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాక్రిష్ణ జయంతి ని పురస్కరించుకుని నిర్వహించాల్సిన గురుపూజోత్సవం శుక్రవారం ప్రభుత్వ సెలవుదినం కావడంతో ముందస్తుగా గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ అద్యక్షతన ముందస్తుగా నిర్వహించిన గురుపూజోత్సవం వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.
చదువు అనేది ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం వెలుగు చూపే దీపం అని ఆ దీపాన్ని వెలిగించేది ఉపాధ్యాయులను సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో ప్రాధాన్యత గలదని,పిల్లలలో మంచి ఆలోచనలు,క్రమశిక్షణ, విజ్ఞానం నింపి భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయడంలో ఉపాధ్యాయులు అహర్నిశలు కష్ట పడాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతీ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని అన్నాలు.ఉపాద్యాయుల భాద్యతలు పెరుగుతున్నాయి అని అందుకు అనుగుణంగా వారు ప్రణాళికలు వేసుకోవాలని కోరారు.
తాను 2003 లో వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరాను అని,మూడు దఫాలు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాను అని గుర్తు చేసారు. ఉత్తమ ఉపాద్యాయులు గుర్తించబడిన వారు ఆ గౌరవాన్ని నిలబెట్టాలి అన్నారు. విద్యార్ధులు సామర్ధ్యాలు పెంచాలి అని,లోకజ్ఞానం నేర్పాలి అని అన్నారు. సమాజంలో ఉన్నతమైన వృత్తి ఉపాద్యాయ వృత్తే నని, నాకు రాజకీయంగా గుర్తింపు లేకపోయినా ఉపాద్యాయ వృత్తే నాకు గుర్తింపు నిచ్చింది అన్నారు.సామాజిక స్పృహ కల్పించాలి అని,రాష్ట్ర స్థాయిలో విద్యాపరంగా అశ్వారావుపేట నియోజక వర్గం 13 స్థానంలో ఉంది అని, ట్రిపుల్ ఐటీ ఎంపిక లోనూ ముందంజలో ఉన్నాం అని హర్షం వ్యక్తం చేసారు.
ఉపాధ్యాయుడు గా ఆదరించారు అని,297 దేశాలు పాల్గొన్న ప్రపంచ సెమినార్ లో తెలంగాణ నుండి నేనొక్కడినే 45 నిమిషాలు మాట్లాడాను అని గుర్తు చేసారు.ఎమ్మెల్యే గా నాకు ఏ అవకాశం వచ్చినా వదులుకోవడం లేదని,ప్రతీ దానిలోనూ విద్యా వైద్యం కోసం మే నేను ప్రస్తావిస్తున్నాను అన్నారు. విద్య తోనే సామాజిక అభివృద్ది సాధ్యం అని అభిప్రాయ పడ్డారు. అనంతరం మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.గురువులను గౌరవించడం ప్రతి విద్యార్థి అలవర్చుకోవాలని పేర్కొన్నారు
గ్రామీణ ప్రాంత పిల్లలు కూడా ఉన్నత విద్యలో ముందుకు రావడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విశేషంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రసాద్ రావు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉద్యోగ విరమణ పొందిన ఉపాద్యాయులు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు తుమ్మ రాంబాబు,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.