Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.!

తాడిచెర్ల హైస్కూల్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం.!

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి పురస్కరించుకొని మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.విద్యార్థినీ విద్యార్థులు  ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను శాలువాలతో  సత్కరించారు.

మెరిట్ విద్యార్థులకు స్కాలర్ సిప్పులు..

తాడిచెర్ల  హైస్కూల్లో చదువుతున్న విద్యార్థుల్లో భాగంగా ప్రతి సంవత్సరం మెరిట్ విద్యార్థులకు పలువురు ప్రోత్సాహం అందిస్తున్నారు.ఈ నేపథ్యంలో గత ఐదు సంవత్సరాల నుంచి నిత్య సేవా సంఘ సమితి హైదరాబాద్ నిర్వాహకులు బాల సంకుల ఉదయ్,భాస్కర్ రావు (ఈ పాఠశాల పూర్వ విద్యార్థి,తాడిచర్ల వాస్తవ్యులు),సుచరిత సహకారంతో రూ.15వేలు,పమ్మిడి  సాగర్ రావు రూ.5వేలు ప్రతి సంవత్సరం మెరిట్ స్కాలర్షిప్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

ఈ సంవత్సరం కూడా 7వ తరగతి నుంచి శ్రావణి, శ్రీయ,8వ తరగతి నుంచి కీర్తన,అంజలి,9వ తరగతి నుంచి సిరి చందన,శైలాని, సిరి,వర్థినీ,లావణ్య,ఆశ్రిత,10వ తరగతి నుంచి ప్రణవి,లాస్య,అశ్విత,శివమణి తదితర మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ బహుమతిగా అందించడం జరిగిందన్నారు.ఈ  కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీపీ మలహర్ రావు,సాగర్ రావు,ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad