- Advertisement -
నవతెలంగాణ-మల్హర్ రావు: భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం మండలంలోని పెద్దతూండ్ల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.సర్వేపల్లి దేశంలో చెసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.అనంతరం పాఠశాల విద్యార్థులు,ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులను పూల మాలలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జి హెడ్ మాస్టర్ శ్రీమతి మానస,యాకూబ్ పాషా, ఐత మహేందర్,సుజాత,గోపికృష్ణ,చంద్రప్రకాష్,ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్,రవీందర్ పాల్గొన్నారు.
- Advertisement -