- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
భారత దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం మండలంలోని కొయ్యుర్ దేవి విద్యోదయ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్లుగా పాఠశాల కరస్పాండెంట్ కుడుదుల రాజు తెలిపారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు.సర్వేపల్లి దేశంలో చెసిన సేవలను కరస్పాండెంట్ కొనియాడారు. విద్యార్థులు సర్వేపల్లి అడుగు జడల్లో నడవాలని సూచించారు. చిన్నారులు ఉపాధ్యాయుల స్థానంలో ఒక బోధించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -