Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

విశ్రాంతి ఉద్యోగుల సంఘ భవనంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు..

- Advertisement -

నవతెలంగాణ –  ఆర్మూర్  
పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో  పెన్షనర్స్ సంఘ అధ్యక్షులు రాజేశ్వర్ రెడ్డి అధ్యక్షతన పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, రామకాంత్ లు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి, ఆయన సేవలను కొనియాడుతూ ఘన నివాళులర్పించారు.

కార్యక్రమంలో  పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ కార్యదర్శి కొక్కుల రమాకాంత్ కొక్కుల విద్యాసాగర్ చిట్ల యగ్నేష్ ల ఆధ్వర్యంలో సీనియర్ విశ్రాంత ఉపాధ్యాయులు యు.సాయన్న,నర్సింలు, రామ్మూర్తి,అంజయ్య,సుధాకర్,మల్కన్న లను కండువా కప్పి పుష్పగుచ్ఛాన్నిచ్చి ప్రత్యేక బహుమతితో సత్కరించారు. ఈ సందర్భంగా పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్ మాట్లాడుతూ సన్మాన గ్రహీతల సేవలను అభినందించారు. విశ్రాంత ఉద్యోగులందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలను అనునిత్యం ఆనందమయంగా గడపాలని కోరుతూ “ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షల తెలిపారు..ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad