- Advertisement -
నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కేరళ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదవ తరగతి, ఆరవ తరగతి, ఏడవ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల జిమ్మీ, తోటి ఉపాధ్యాయులు ఉన్నారు.
- Advertisement -