- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సీఎం కప్ క్రీడల ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్ లకు పాఠశాల తరఫున ఉపాధ్యాయులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్, ఉప సర్పంచ్ మాట్లాడారు. క్రీడలు మానసికోల్లాసానికి, శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి క్రాంతి కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ తిరుపతి, ఉపాధ్యాయునీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



