Saturday, October 25, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వైద్య విద్యార్థినికి ఉపాధ్యాయుని ఆర్థిక సహాయం అభినందనీయం

వైద్య విద్యార్థినికి ఉపాధ్యాయుని ఆర్థిక సహాయం అభినందనీయం

- Advertisement -

నవతెలంగాణ – నూతనకల్
వైద్య విద్యార్థినికి ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనంతుల కళావతి అన్నారు. శనివారం మండల పరిధిలోని ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన నిరుపేద వైద్య విద్యార్థిని  దంతాల అనుష కు అదే గ్రామంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న సామ సవేందర్ రెడ్డి 10వేల 116లు ఆర్థిక సహాయాన్ని ఆమె విద్యార్థినికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించి అత్యున్నతమైన పోటీ తత్వమున్న వైద్య విభాగంలో సీటు సంపాదించడం అభినందనీయమని అన్నారు. ఆమె విద్యార్థిని ఆర్థిక పరిస్థితులను తెలుసుకున్న సహాయ ఉపాధ్యాయుడు ఆర్థికంగా సహాయం చేయడం అభినందనీయమని తెలిపారు. ఉపాధ్యాయుని సహాయం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -