Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. చిన్నారి బలి 

ఉపాధ్యాయుల నిర్లక్ష్యం.. చిన్నారి బలి 

- Advertisement -

నవతెలంగాణ – బీర్కూర్ (నసురుల్లాబాద్) 
ప్రభుత్వ పాఠశాల్లో అనుభవం గల ఉపాధ్యాయులు, పక్క భవనం, విద్యార్థులకు సంపూర్ణ భద్రత ఉంటుందని పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతుంటే ఉపాధ్యాయుల నిర్లక్ష్య కారణంగా ఓ పసి బాలిక, మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

 కామారెడ్డి జిల్లా మండలం బీర్కూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ బాలికల ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న శివశ్రీ (9) అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం శివశ్రీ ఉదయం పాఠశాల వెళ్ళింది. అక్కడ పాఠశాల ప్రార్థన సమయంలో కడుపునొప్పితో బాధపడుతూ తరగతి గదికి చేరుకుందని. పాఠశాల గదిలో శివశ్రీ తీవ్ర అస్వస్థతకు గురైందని, వెంటనే ఇన్ ఛార్జ్ గా ఉన్న ఉపాధ్యాయులు ఆ చిన్నారిని ఇంటికి పంపించారు. ఇంటి వద్ద తల్లిదండ్రులు లేకపోవడం వల్ల, ఆ చిన్నారి ఇంటి వద్దనే వాంతులు, విరోచనాలు చేసుకుని పడిపోయింది.

చాలాసేపటి తర్వాత తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నారు. అస్వస్థతకు గురైన శివశ్రీని వారు కూడా వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లలేదు. దీంతో శనివారం ఉదయం 6 గంటలకు శివశ్రీ బాలిక ఆరోగ్యం పూర్తిగా విషమించింది. నడవలేని స్థితిలో ఉండగా అప్పుడు ఆ బాలికను బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే శివశ్రీ అనే విద్యార్థిని పరిస్థితి విషమించి కన్ను మూసింది. పాఠశాలలో అస్వస్థతకు గురైన ఆ చిన్నారిని ఉపాధ్యాయులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తే, అక్కడ వైద్య సేవలు అందిఉంటే, పాప బతికుండేది. ఉపాధ్యాయులు ఆ చొరవ చూపకపోవడం దారుణమైన విషయం. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పాపను ఇంటికి పంపించి టీచర్లు చేతులు దులుపుకున్నారు.

ఇంటికి చేరుకున్న బాలికకు ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడం శాపంగా మారింది. ఉదయం బాలిక అస్వస్థత గురైనప్పుడు వెంటనే ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తే బాలిక బతికి ఉండేదని గ్రామస్తులు అభిప్రాయాన్ని వెల్లడించారు. బాలిక మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ అరిగే ధర్మతేజ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబానికి రూ.5 వేలు, ఎస్ ఐ మహేందర్ రూ.5 వేల ఆర్థిక సహాయం అంది అందజేశారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -